భార్య, పిల్లలతో కలిసి ఓటేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి.

భార్య, పిల్లలతో కలిసి ఓటేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి.

TEJA NEWS

The Chief Minister of Delhi voted with his wife and children.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తన ఓటు వేశారు. కేజ్రీవాల్ తన భార్య, కుమార్తె, కుమారుడు, తండ్రిలో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి..
తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బ్రతికి ఉండాలంటే సరైన పార్టీని గెలిపించాలని కోరారు. ప్రజలను మోసం చేసే వారికి తగిన బుద్ది చెప్పాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ఇక, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా చాలా కాలంగా విదేశాల్లో ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీతో ఆయన సంబంధాలు, భవిష్యత్తుపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై ఎదురైన ప్రశ్నలకు కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరు మౌనంగా ఉండిపోయారో, విదేశాల్లో ఉండిపోయారో తమ పార్టీ విషయం.., దాన్ని తొందరగానే పరిష్కరిస్తానని చెప్పారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలను రాజీనామా చేయమని కోరడాన్ని కేజ్రీవాల్ ఖండించారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కేజ్రీవాల్ ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS