Spread the love

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ జరిగిన తర్వాతనే 1,2,3 పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్

, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలుగు తల్లి విగ్రహం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో, చేపట్టిన నిరసన దీక్షలు,రెండవ రోజుకు చేరుకున్నాయి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వీరస్వామి మాదిగ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతనే 1,2,3 పోస్టులు భర్తీ చేయాలని, డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ చట్టసభలో అమలు చేయాలని, ఏబిసిడి వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాతనే, ఎలాంటి ఫలితాల నైనా విడుదల చేయాలని, డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో, మబ్బు సాయిలు, కిరణ్, కృష్ణ, జగన్, బాలయ్య, ఎమ్మెస్ ఎఫ్, దేవరాజ్, తదితరులు పాల్గొన్నారు.