
చిరంజీవి నోటా జనసేన మాట?
హైదరాబాద్:
మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినీ కెరీర్ ఎంత ఇంట్రెస్టింగో..పొలిటికల్ అడుగులు కూడా అంతే ఇంట్రెస్టింగ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకముందే.. కాంగ్రెస్‌లో విలీనం చేసి..రాష్ట్ర విభజన తర్వాత నో పాలిటిక్స్ అనేశారు. బిగ్ బాస్
కానీ గత రెండు మూడేళ్లు గా ఆయన మళ్లీ పాలిటిక్స్ వైపు అట్రాక్ట్ అవుతున్నా రన్న టాక్ వినిపిస్తోంది. దేశ ప్రధాని మోదీతో పాటు, పలువురు రాజకీయ ప్రము ఖులతో చిరు సన్నిహితంగా ఉంటడం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.
ఈ నేపథ్యంలో చిరు పొలిటికల్ రీఎంట్రీ ఖాయమన్న వార్తలు ఊపందుకున్నాయి. సరిగ్గా ఇదే టైమ్‌లో బాస్ మరో బాంబ్ పేల్చేశారు. ఏకంగా ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో జై జనసేన అనేశారు. ఫస్ట్ టైమ్ చిరంజీవి నోటీ నుంచి జనసేన ప్రస్తావన రావడం హాట్ టాపిక్ గా మారింది .
ఫ్యాన్స్‌తో కలిపి చిరు వాయిస్ వినిపించారా? లేక ఫ్లోలో మాట్లాడేశారో తెలియదు కానీ..చిరు నోట జనసేన మాట రావడం మాత్రం..అటు సినీ, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది.
ప్రజారాజ్యం, జనసేనపై కీలక వ్యాఖ్యలు చేశారు చిరు. జై జనసేన అని అన్నారు. ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా మారిపోయిందన్న మెగాస్టార్..ఐయామ్ వెరీ హ్యాపీ అంటూ చెప్పుకొచ్చా రు. చిరంజీవి వ్యాఖ్యలతో అటు మెగా, ఇటు జనసేన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
మెగాస్టార్ కామెంట్స్ మాత్రం పొలిటికల్‌గా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
