TEJA NEWS

గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కొరియోగ్రాఫర్..

హైదరాబాద్:
హైదరాబాద్‌ కొండాపూర్‌లో డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఓ ఓయో రూమ్‌లో ఆదివారం అర్ధరాత్రి పార్టీ జరుగు తుండగా సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా రైడ్స్‌ నిర్వహించారు.

డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో డీ కొరియోగ్రాఫర్‌ కన్హ మహంతితో పాటు.. ఆర్కిటెక్చర్‌ ప్రియాంకరెడ్డి ఉన్నారు.వీరితో పాటు గంగాధర్‌, షాకీ అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చి పార్టీ చేసుకుం టుండగా పోలీసులు వీరిని అరెస్టు చేసినట్టు తెలుస్తుం ది,వారి నుంచి 4 లక్షల 80 వేల విలువైన 8 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం చేసుకున్నట్టు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కుమార్‌ వెల్లడించారు.


TEJA NEWS