గ్రామ పంచాయతీ కార్మికుల వేతనలు వెంటనేచెల్లించాలని సిఐటియు

గ్రామ పంచాయతీ కార్మికుల వేతనలు వెంటనేచెల్లించాలని సిఐటియు

TEJA NEWS

CITU to pay the wages of Gram Panchayat workers immediately

గ్రామ పంచాయతీ కార్మికుల వేతనలు వెంటనేచెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

★ మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాల నీ డిమాండ్..

సాక్షిత* వనపర్తి * జిల్లాలో
ఆరు నెలల నుండి పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయితీ వర్కర్స్ వేతనలను వెంటనే చెలించాలని బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు (CITU) ఆధ్వర్యంలో జిల్లా కాలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నాగేష్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతకు ముందు మర్రికుంట మెయిన్ రోడ్డు నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా * సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు , జిపి వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మండ్ల రాజు మాట్లాడుతూ చాలిచాలనీ వేతనాలతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ తమ జీవితాలను కోవ్వోత్తిలాగా కరిగించుకుంటున్న గ్రామ పంచాయతీ కార్మికులపై నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సవతి తల్లీ ప్రేమ చూపుతుందాని ఆరోపిస్తూ విద్యా సంవత్సరం ప్రారంభం కావడం జరిగింది, గ్రామపంచాయతీ కార్మికులు వారి పిల్లల కు విద్యకు సంబంధించిన వస్తువులు స్టడీ మెటీరియల్ (సమగ్రి) ఇప్పించడం కోసం కూడా వారితో డబ్బులు లేవు, ఈ ప్రభుత్వం వారి పిల్లలను చదువుకు దూరం చేసే విధంగా విధానాలను అవలంబిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనలు ఇవ్వాలని లేని యెడల రానున్న వర్షం కాలం సీజన్ లో గ్రామ పంచాయతీ సిబ్బంది మరో మారు ఆందోళన బాట పట్టక తప్పదాని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టిపర్పస్ విధానాని రద్దు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యం కల్పించాలని. ఉద్యోగ భద్రత కల్పించాలి.

గ్రామపంచాయతీ కార్మికులపై అధికారుల వేధింపులను ఆపాలి డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26000/- ఇవ్వాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ 51 సవరించాలని. ఎన్నికల సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికుల కు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము. సిఐటియు జిల్లా నాయకులు ఎన్ రాములు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి. పుష్ప. జిల్లా నాయకులు హరిప్. కిషన్ నాయక్. సుగ్రీవుడు. వెంకటేష్. దాసు. శ్రీను. లక్ష్మయ్య. నాగన్న. నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS