Spread the love

నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుందని 45 వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య తెలిపారు.
సితార ప్రాంతానికి చెందిన దారపనేని చెన్నకేశవులుకు భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో శుక్రవారం సీఎం ఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి అందజేశారు.
చెన్నకేశవులు అనారోగ్యం బారిన పడటంతో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 20 వేలు మంజూరయ్యాయి.
అందుకు సంబంధించిన చెక్కును అందజేశారు.
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు అండగా నిలుస్తుంది కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య తెలిపారు.
ఎన్డీఏ కూటమి నేతలు అలుగుండ్ల సుబ్బారెడ్డి, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.