TEJA NEWS

CM Revanth phoned Chandrababu

చంద్రబాబుకు సీఎం రేవంత్ ఫోన్
ఏపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తుండటంపై అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, సమస్యలు పరిష్కరించుకుందామని చంద్రబాబును కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా, ప్రమాణస్వీకారానికి చంద్రబాబు పిలిస్తే వెళ్తానని నిన్న రేవంత్ చెప్పిన సంగతి తెలిసిందే.


TEJA NEWS