మహబూబ్ నగర్ జిల్లా: నవంబర్ 21
మాగనూరు మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన వికరించి 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా,తీసుకున్నారు
ఈ క్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎం మురళీధర్ రెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం బాబు రెడ్డిని సస్పెండ్ చేశారు.
విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడం… వారిలో 8వ తరగతి విద్యా ర్థి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.అంతే కాకుండా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి,ఆదేశిం చారు.
బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిం చాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీపడేదిలేదని స్పష్టం చేశారు.ఇలాంటి ఘటనలు పునారావృతం అయితే కఠిన చర్యలు తీసుకుం టామని సీఎం హెచ్చరిం చారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక పంపించాలని,జిల్లా కలెక్టర్, సీఎంవో అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూదని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం అప్రమత్తం చేశారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ చోటు చేసుకుం టున్న సంగతి తెలిసిందే. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ హాస్టళ్లు, స్కూల్స్ పరిస్థితి మాత్రం మారడంలేదు. నాణ్యమైన భోజనం అందకపోవడంతో విద్యా ర్థులు పౌష్ఠికాహారలోపంతో బాధపడుతున్నారు.
మరోవైపు పాడైపోయిన కూరగాయాలు, డేట్ అయిపోయిన వంట సామాగ్రితో వంటలు చేయడంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల డైట్ ఛార్జీలు పెంచుతూ మెస్ నిర్వాహ కులను హెచ్చరించారు.
ఆహారం నాణ్యత తగ్గినా, ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. అయినప్పటికీ మరో ఘటన చోటుచేసుకోవ డంతో సీఎం రేవంత్ రెడ్డి, స్వయంగా రంగంలోకి దిగారు.