దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ
కాంగ్రెస్ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు.
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన వెళ్లారు.
నేడు పలువురు కేంద్రమంత్రులను కలవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్లు కోరినట్లు తెలిసింది.
ఇందులో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ ఉన్నారు.
కేంద్రమంత్రులు ఇచ్చే సమయాన్ని బట్టి ముఖ్యమంత్రి వారితో భేటీ కానున్నారు.