మహబూబ్‌నగర్:మార్చి 07
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వా మ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు.
మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన పాలమూరు ప్రజాదీవెన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ప్రభు త్వంలో తెలంగాణను దోచు కున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.
అప్పట్లో పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావును దివంగత ప్రధాని నెహ్రూ ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు రేవంత్. తాను తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయట్లేదని కేటీఆర్‌కు చురకలంటిం చారు.
మొదటిసారి జడ్పీటీసీగా తనను పాలమూరు ప్రజలు గెలిపించారన్నారు. తమ తాతలు, ముత్తాతలు సీఎంలు కాదు, తనకు కోట్ల రూపాయలు ఇవ్వలేదని తెలిపారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని రేవంత్ చెప్పుకొచ్చారు.
మీరే నన్ను 2007లో ఎమ్మెల్యే చేశారు. 2014లో నన్ను మళ్లీ గెలిపించారు. మల్కాజ్‌గిరి గెలుపుతోనే సోనియాగాంధీ నన్ను పీసీసీ అధ్యక్షుడిగా చేసింది. రాష్ట్ర అభివృద్ధిపై సభా ముఖంగా పీఎంను నిలదీశాను.
ప్రధానికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చారని కొందరు మాట్లాడుతున్నారు. నేను గదిలో వినతిపత్రం ఇవ్వ లేదు, నిండు సభలో అడిగాను. అతిథి మన రాష్ట్రానికి వస్తే గౌరవించడం మన సాంప్రదాయం అన్నారు.
విజ్ఞతతో కూడిన వినతి పత్రాలు దేశ ప్రధానికి ఇచ్చా’ అని బీఆర్ఎస్ నేతల విమర్శ లకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు.ప్రధాని మోడీని గౌరవిస్తామని.. కానీ, తెలంగాణ అభివృద్ధికి సహకరించ కుంటే.. కేంద్రం పై పోరాటం తప్పదని హెచ్చరించారు.