ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం

ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం

TEJA NEWS

CM Revanth Reddy's cabinet meeting on 21st of this month

ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం

హైదరాబాద్‌:
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ మంత్రిమండలి భారీ అజెండాతో సమావేశం కాబోతోంది.

ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 21న ఉదయం 11 గంటలకు సచివాలయం వేదికగా కేబినెట్‌ భేటీ జరగనుంది.పరిపలనకు సంబంధించిన అనేక అంశాలు, చర్చకు రానున్నాయి..

సంక్షేమ రంగానికి చెందిన కీలక నిర్ణయాలు, ఉద్యో గులు, ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకా లు తదితర అంశాలు అజెం డాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

అత్యంత ప్రాధాన్యత గల, రాజకీయ సవాళ్ళతో ముడిపెట్టుకుని ఉన్న అంశం రైతు రుణమాఫీ, నిధుల సమీకరణపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

లబ్ధిదారుల ఎంపిక విష యంలో అనుసరించాల్సిన విధానాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఇదివరకున్న మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎం రేవంత్‌ తమ మంత్రివర్గ సహచరుల అభిప్రాయం తీసుకోను న్నారు.

అలాగే పదేళ్ల గడువు ముగి సిన నేపథ్యంలో విభజన సమస్యల పరిష్కారం దిశగా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.

చట్టంలోని 9వ, 10వ షెడ్యూల్‌ సంస్థల విభజన అడ్డంకులకు పరిష్కార మార్గం చూపనున్నారు. విద్యుత్‌ ఒప్పందాలు, కాళేశ్వరం అక్రమాలపై చర్చించనున్నారు. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషి యల్‌ కమిషన్ల విచారణ, ఇప్పటికే ఇచ్చిన ప్రాథమిక నివేదిక అంశాలపై కూడా చర్చ జరగనుంది.

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌ సీ, డీఏ, ఇతర సమస్యలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. తాజాగా సీఎం ప్రకటించిన నూతన విద్యా విధానంపై కేబినెట్‌ చర్చించనుంది.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదికపై చర్చించి, మరమ్మతులు, తదుపరి కార్యాచరణలపై నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం…

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి