ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్-
16,35,000 వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన……….. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి
వనపర్తి
ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ప్రభుత్వం అపన్న హస్తం అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి పేర్కొన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో చిన్నా రెడ్డి నియోజకవర్గం లోని ఏడు మండలాలకు సంబంధించి 53 మంది లబ్దిదారులకు పదహారు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి,మత్స్య కారుల సంఘం జిల్లా అధ్యక్షులు యాదయ్య, చిర్ల జనార్ధన్ జిల్లా దివ్యాంగుల సేల్ అధ్యక్షులు గంజాయి రమేష్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సమ్మద్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం దేవన్న యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి.బాబా,పెద్ద మందడి మండల అధ్యక్షులు పెంటన్న యాదవ్,గోపాల్ పేట మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి,సీనియర్ నాయకులు రాగి వేణు,కోళ్ల వెంకటేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.