కూలిపోవడం కొత్త కాదు: హరీశ్ రావు
ప్రాజెక్టులు, నిర్మాణాలు కూలిపోవడం కొత్త కాదని హరీశ్ రావు చెప్పారు.
గతంలో జరిగిన ఘటనలను ఈ సందర్భంగా వెల్లడించారు.
దేవాదుల ఫేస్-3 టన్నెల్ అప్పట్లో కూలిపోయింది.
సింగూరు డ్యాం గేట్లు కొట్టుకుపోయాయి.
పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉండగానే పడిపోయింది.
కాంగ్రెస్ హయాంలోనే మూసీ గేట్లు కొట్టుకుపోయాయి.
ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది అని తెలిపారు.
కాళేశ్వరం విషయంలో తప్పు జరిగితే బాధ్యులను శిక్షించాలని హరీశ్ రావు కోరారు.
తప్పు ఎవరు చేసినా తప్పేనని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారంలో ఉన్నందున తాము ఏ విచారణకైనా సిద్ధమేనని తెలిపారు.
వాస్తవాలు బయటపెట్టి అంతిమంగా రైతులకు మేలు జరిగేలా చూడాలని అన్నారు.
గతంలో కాంగ్రెస్ నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టాలని చూస్తే తాము నీళ్లున్న చోట నిర్మించామని తెలిపారు.