TEJA NEWS

డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు
ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షల కోసం కేసీఆర్ ప్రారంభించిన డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ 36 డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేసి 134 పరీక్షలను అందుబాటులో ఉంచారని, అవి ప్రస్తుతం నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇప్పటికైనా అందులో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి పెండింగ్ జీతాలు చెల్లించి ఆ సేవలను పునరుద్ధరించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.


TEJA NEWS