TEJA NEWS

చిలకలూరిపేట వరద ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటనపల్నాడు జిల్లా

చిలకలూరిపేట:
మొంథా తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లాలో నమోదైన భారీ వర్షాల నేపథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి పర్యటించారు.కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సగటు వర్షపాతం 86 శాతం నమోదైందని తెలిపారు. చిలకలూరిపేట పురుషోత్తమపట్నంలో 200 మిల్లీమీటర్లు, ఎడ్లపాడు మండలంలో 170 మిల్లీమీటర్లు, నాదెండ్ల మండలంలో 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు.జిల్లాలో ప్రస్తుతం 22 చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయని, వాహనాలను ట్రాఫిక్ డైవర్షన్ చేసి సురక్షితంగా తరలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం వర్షపాతం తగ్గిందని, అధికారులు మూడు రోజులుగా నిరంతరంగా ఫీల్డ్‌లో పనిచేస్తూ పరిస్థితిని నియంత్రణలో ఉంచారని ఆమె వివరించారు.చిలకలూరిపేట పట్టణంలో అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల నీటి మిగులు త్వరగా బయటికి వెళ్లిందని, నీరు తగ్గిన తర్వాత పట్టణంలో శానిటేషన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు.