
అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయండి. కమిషనర్ ఎన్.మౌర్య
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని జీవకోన, రాజీవ్ గాంధీ కాలని తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ్య పనులను ఇంజినీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీవకోన వంటి ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. అలాగే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇంటింటి చెత్త సేకరణ పక్కగా చేయాలని, ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. డ్రెయినేజీ కాలువలు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్త తొలగించడం, కాలువలు శుభ్రం చేయడం వంటివి ప్రణాళికాబద్దంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, తుడా ఈఈ రవీంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, తదితరులు ఉన్నారు.
