TEJA NEWS

మానవత్వాన్ని చాటుకున్న రాణిగంజ్ డిపో డ్రైవర్లు, కండక్టర్లు..

మల్కాజిగిరి

రాణిగంజ్ డిపో లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ రషీద్ తోటి సిబ్బంది ఇబ్బందుల్లో ఉంటే అండగా ఉండాలని ఉద్దేశంతో, మానవసేవే మాధవసేవ అనే గ్రూప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కోవలో రాణిగంజ్ డిపోలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాధా అనే మహిళ ఇటీవల ప్రమాదపుశాతు చేతికి గాయం కావడంతో, రషీద్ తన తోటి ఉద్యోగులకు విషయాన్ని తెలియజేసి వారి సహకారంతో, సోమవారం రాణిగంజ్ డిపో డిఎం శ్రీధర్, ఎం ఎఫ్ జి కే రెడ్డి, ఏ డి సి మల్లయ్య, కంట్రోలర్ జయ చేతుల మీదగా మహిళ రాధకు 50 కిలోల బియ్యము, నిత్యవసరాల సరుకులతో పాటు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రషీద్, ఎన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS