TEJA NEWS

రాష్ట్రపతి అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు

న్యూ ఢిల్లీ :

భారత దేశ ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి జగదీప్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల గవర్నర్లు హాజరు కానున్నారు. నూతన క్రిమినల్ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సేంద్రియ వ్యవసాయం,
మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తదితర అంశాలపై చర్చిస్తారు.


TEJA NEWS