TEJA NEWS

బిజెపికి అఖండ మెజార్టీని అందించిన మహారాష్ట్ర ప్రజలకు అభినందనలు : శంకర్పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షుడు బండమీది వెంకటయ్య

శంకర్పల్లి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కి అఖండ విజయాన్ని చేకూర్చి మళ్లీ అధికారాన్ని కట్టబెట్టినందుకు మహారాష్ట్ర ఓటరు దేవుళ్లకు , శంకర్పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షుడు బండమీది వెంకటయ్య శిరసాష్టంగా నమస్కారములు తెలియజేశారు. వారు మాట్లాడుతూ దమ్మున్న మన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచినందుకు , దేశాభివృద్ధి ద్యేయంగా పనిచేసినందుకు యావత్ దేశం గర్విస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని దేశద్రోహ ,కుహనా ,లౌకిక పార్టీలను చావు దెబ్బ కొట్టి తగిన గుణపాఠం నేర్పినందుకు మరోసారి మహారాష్ట్ర ప్రజలను మనసారా అభినందిస్తున్నాను అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు అని తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు అందరూ కలిసి ప్రచారం నిర్వహించిన అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందారని తెలిపారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే ముఖ్యమంత్రి, మంత్రులు ,అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజులలో తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఒక ఉన్నతమైన స్థితికి చేరుకుంటుందని, ప్రపంచంలోని దేశాలన్నిటికీ జవాబుదారీగా ఉంటుందని తెలిపారు.


TEJA NEWS