జూబ్లీహిల్స్ ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతోంది : ఎమ్మెల్యే జారే
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజల హృదయాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ మీదే విశ్వాసం ఉందన్నారు. ప్రజల అభీష్టం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉందన్నారు. అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం ఖాయం అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి అందించిన సేవలు ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫలిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నాయకులతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు పాల్గొన్నారు.
