లండన్ కిడ్స్ స్కూల్‌ను ప్రారంభించిన కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి,

TEJA NEWS

లండన్ కిడ్స్ స్కూల్‌ను ప్రారంభించిన కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, వాషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ డా. దాసరిరాజు అజయ్ కుమార్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలోని సాయినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “లండన్ కిడ్స్ స్కూల్” ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వాషర్ మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్ హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఈ పాఠశాల దోహదపడాలని ఆకాంక్షించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సాయి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ స్కూల్ ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
అనంతరం, నూతన పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దిన స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్‌కు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి వారు ప్రత్యేకంగా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ ఇంచార్జ్ కొలన్ రాజాశేఖర్ రెడ్డి బాచుపల్లి డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, మహాదేవపురం అధ్యక్షులు సిద్దనోల సంజీవరెడ్డి,మల్లికార్జున్, ప్రవీణ్, హబీబ్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top