కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

TEJA NEWS

Congress party in-charge Kolan Hanmant Reddy stands with the people of Kuthbullapur constituency.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ కి చెందిన నాగరాజు భార్య సుజాత గత కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేకపోవటంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితురాలి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ.2,50,000/- (రెండు యాభై వేల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను నాగరాజు కుటుంబ సభ్యులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బి -బ్లాక్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, గడ్డం రాజేందర్ రెడ్డి, గణేష్, నర్సింగ్ రావు, ప్రసన్న కుమార్, నరేష్, అమీర్ అలీ, స్వాతి, శ్రీలత ముదిరాజ్, ఫారీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు .

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి