కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ సోదరుడు మృత దేహానికి నివాళులు అర్పించిన………… జాతీయ ప్రొఫెషనల్ కాంగ్రెస్,వైద్య విభాగ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి
వనపర్తి
వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ సోదరుడు మురళి(42)గుండె పోటుతో రాత్రి మృతిచెందారు .విషయం తెలుకున్న జాతీయ ప్రొఫెషనల్ కాంగ్రెస్,వైద్య విభాగ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ఉదయం వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండల కేంద్రంలోని మృతుడు మురళి నివాసంలోని మృత దేహం పై పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించారు.ఈ సందర్బంగా జాతీయ ప్రొఫెషనల్ కాంగ్రెస్,వైద్య విభాగ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ సోదరుడు మురళి(42) హఠాత్మరణం చెందడం బాధాకరమన్నారు.కాంగ్రెస్ పార్టీ వారికుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.కుటుంబ సభ్యులను ఓదార్చే ధైర్యం నింపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,మండల అధ్యక్షులు,గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..