
బూత్ బలంగా ఉంటేనే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది.”–*డిసిసి చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి
పకడ్బందీ నిఘాతో బిఎల్ఎ-2 లు వ్యవహరించాలి-*పార్లమెంట్ ఇంచార్జ్ సిద్దేశ్వర్
బూత్ పరిధిలోని ప్రతి ఇంటికి సంప్రదించాలి
వనపర్తి
ప్రతి పౌరుడికి ఓటు హక్కు ప్రాధాన్యత తెలుపుతూ.. బూత్ లో కాంగ్రెస్ ఏజెంట్ బలంగా ఉంటేనే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని దిశా నిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డిసిసి చీఫ్ శివసేన రెడ్డి అధ్యక్షతన బిఎల్ఎ -2 సభ్యుల ఇన్చార్జిలకు పార్లమెంట్ ఇన్చార్జి సిద్దేశ్వర్ తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డిసిసి చీఫ్, మాట్లాడుతూ.. బూతు స్థాయి దాట నిర్వాణ ప్రతి కుటుంబం ఓటు వివరాలు మార్పులు సమస్యలపై ప్రత్యేక రికార్డు నిర్వహించాలని సూచించారు. బోగస్ ఓట్లను మరణించిన వారి ఓట్లను ఇతర ప్రాంతాలకు మార్చిన వారి ఓట్లను పై ప్రత్యేక దృష్టి పెట్టి డూప్లికేట్ పేర్లు ఉన్న వారి వివరాలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ ఓట్లను భద్రపరచాల్సిందిగా సూచించారు.
అనంతరం పార్లమెంటు ఇన్చార్జి సిద్దేశ్వర మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిక్షణం మానిటరింగ్ చేస్తున్నారని, రేపటి నుంచి సర్ పక్రియకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీకే మధ్య పోటీ ఉంటుందన్నారు. బిజెపి కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓట్లును కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుందని దుయ్యబడ్డారు.
నమోదు ప్రక్రియలో జాగ్రత్తలు పాటించి నమోదు ప్రక్రియ చేయాలని, వివరాలు మార్పులు సమస్యలపై సందేహాలు ఉంటే వనపర్తి డిసిసి కార్యాలయంలో కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని సూచించారు. రేపు జరిగే సర్ ఓటర్ నమోదు కార్యక్రమంలో ఇబ్బందులు తదితతే కార్యాలయంలో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు సమాచారం ఇవ్వలన్నారు.
ఈ సమావేశ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి, తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కోళ్ల వెంకటేష్, శరవంద, జనార్దన్ సాగర్, ధనలక్ష్మి, పట్టణాధ్యక్షుడు కదిరే రాములు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.