అమర వీరుల స్మారక స్తూపం నిర్మాణం అభినందనీయం

TEJA NEWS

అమర వీరుల స్మారక స్తూపం నిర్మాణం అభినందనీయం

సూర్యాపేట జిల్లా ప్రతినిధి

నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో మారుమూల గ్రామం అయినప్పటికీ ఈ గ్రామంలో తెలంగాణ అమరవీరుల స్మారకార్థం స్తూపాన్ని ఏర్పాటు చేసి అమరులకు ఘనంగా నివాళులు అర్పించడం ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు
దీని ఏర్పాటుకు సహకరించిన టియుజె రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తుమ్మల ప్రపోల్ రామ్ రెడ్డికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్ కు కొంపెల్లి సాయిలు గ్రామ సర్పంచి సహకరించినటువంటి దాత బత్తిని రాజేందర్ రెడ్డికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో కన్ పార్కులో ఇలాంటి స్తూపం ఉన్నది ఇలాంటి స్థూపం ఈ స్థాయిలో మరెక్కడ లేదు చింతపల్లి గ్రామంలో ఎంతో ఆకర్షణీయంగా తెలంగాణ అమరవీరుల స్మారకార్థం స్తూపం నిర్మించడం చాలా గొప్ప విషయం ప్రపంచంలో ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం 1200 మంది ప్రాణత్యాగాలు చేయడం అనేది ఎక్కడ జరగలేదు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించడానికి అమరుల ప్రాణత్యాగం మరువలేనిది వారి ప్రాణ త్యాగాలను ఏ విధంగాను వెలకట్టలేము తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తగిన గౌరవం ఇవ్వడం లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి.


2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు తాగు గౌరవం ఇస్తామని వారిని ఆదుకోవడానికి ఆర్థికపరమైన విషయాలు మ్యానిఫెస్టోలో పెట్టి వాటిని అమలు పరుస్తామని చెప్పడం అమలు పరచడంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల తెలంగాణ లో తెలంగాణ ఉద్యమకారుల పోరాట సంఘాలు అనేకం ఏర్పాటు అయినవి ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలని రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ వినతి పత్రాలు ఇస్తూ పాలకులకు గుర్తు చేస్తూనే ఉన్నారు దాని ఫలితంగా ఉద్యమకారులను గుర్తించే విషయం అమరులను కుటుంబాలను గుర్తింపు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అన్న విషయాలపై కేశవరావు నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది
ఆ యొక్క కమిటీ విధి విధానాలు గుర్తింపు విషయంలోనూ పైరవీకారులకు అవకాశం కల్పించకుండా నిజమైనటువంటి ఉద్యమకారులకు తెలంగాణ అమరుల కుటుంబాలను గుర్తించి వారికి న్యాయం చేయాలన్నదే ఉద్యమకారుల ఆకాంక్ష
ఈ కమిటీ కాలయాపన కమిటీ అని కూడా విమర్శలు వస్తున్నాయి. కావున రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు ఎన్నటికీ మర్చిపోలేని వారి త్యాగ చరిత్రలు భావితరాలకు తెలిసేలా జిల్లా కలెక్టర్ ఆఫీసులోనూ, మండల రెవెన్యూ ఆఫీసులో, గ్రామపంచాయతీ, పాఠశాలల్లోనూ వారి చిత్రపటాలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ కోసం అమరులైన వీరుల త్యాగాల చరిత్ర రేపటి తరం విద్యార్థులకు తెలియజేయాలి. ఉద్యమకారులు దాతలు తెలంగాణలో పదవులు అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి డిండి చింతపల్లి గ్రామంలో అమరవీరుల స్తూపం నిర్మాణం చేసినట్టుగా ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అమరుల స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లుగా వారిని స్ఫూర్తిగా తీసుకొని అనేక ప్రాంతాలలో తెలంగాణ అమరవీరుల స్మారకార్థం వారి స్తూపాలను ఏర్పాటు చేస్తూ అమరుల త్యాగ చరిత్రను భవిష్యత్తులో గుర్తించుకోవాలి. అంతేకాకుండా అమరుల ఆశయాలకు అనుగుణంగా ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు పాలన చేయాల్సిన అవసరం ఉంది
అవినీతి లేని పరిపాలన విద్య వైద్యం ఆరోగ్యం నిరుద్యోగం ఉపాధి వ్యవసాయం మొదలగు రంగాలకు ప్రాధాన్యతనిస్తూ పారదర్శకమైన పరిపాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ముందు వరుసలో ఉంచాలి. ఇదే మన తెలంగాణ అమరవీరుల ప్రాణ త్యాగాలకు నిజమైన నివాళి.
కుసుమ సిద్ధారెడ్డి – 9989189114

You cannot copy content of this page

Scroll to Top