TEJA NEWS

గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని కొనసాగిస్తూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

ఈరోజు 126 – జగద్గిరిగుట్ట డివిజన్ శివానగర్ లో 65 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని గత రెండు పర్యాయాలు కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పరచామని, అదే అభివృద్ధిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.

గత పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందే ఉందని, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకులకు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది కనుకే మూడవసారి అఖండ మెజారిటీతో గెలిపించారు. అలాగే ప్రజల చేత తిరస్కరించబడిన నాయకులు కొందరు తమ వ్యక్తిగత స్వార్థం కోసం, సొంత వ్యాపారాల అభివృద్ధి కోసం, కుటుంబ వ్యాపార అభివృద్ధి కోసం, పార్టీలు మారుతూ నేడు ప్రజల ముందు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రేలాపనులు చేస్తున్నారన్నారు.

కుత్బుల్లాపూర్ లో గత రెండు పర్యాయాలలో దాదాపు 90% పనులు పూర్తి చేసామని ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే ప్రణాళిక బద్ధంగా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడతామన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, నాయకులు బాబు గౌడ్, శశిధర్, బ్రహ్మానంద చారి, జయకృష్ణ, మల్లేష్ గౌడ్, పాపిరెడ్డి, అజం, ఆంజనేయులు యాదవ్, కిరణ్, ఖయ్యూం, విఠల్, బండ మహేందర్, శివానగర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగరాజుగౌడ్, రాజేశం గౌడ్, విటల్, వెంకటేశ్వర రెడ్డి, రవీందర్, రాజు, వినయ్, అజార్, తుకారం, వెంకట్ రెడ్డి, మహిళా నాయకురాలు సరస్వతి, శాంత, లక్ష్మి, ఫరానా బేగం, మస్జిద్ ఏ మహమ్మదీయ అధ్యక్షులు అక్బర్, ముర్తుజా, అలీ, మొయిజ్, బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS