TEJA NEWS

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం.

రాజన్న సిరిసిల్ల జనవరి 21: నేటి నుండి వేముల‌వాడ రాజ‌న్న ద‌ర్శ‌నం నిరంత‌రం కొన‌సాగ‌నుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాజన్న అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవాళ‌, అలాగే 28 తేదీ , ఫిబ్రవరి 4వ తేదీ, 11వ తేదీ, 18వ తేదీ ఆదివారాల్లో రాత్రి నుంచి తెల్లవార్లు వేములవాడ రాజన్న ఆలయం తెరిచి ఉండనుంది. కోడె మొక్కుబడి, దర్శనాలు కొనసాగనున్నాయి.

ఈ విషయాలను భక్తులు గమనించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తులకు నిరంతరం దర్శనం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.


TEJA NEWS