జీతాల పెంపకై వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల నిరసన.

TEJA NEWS

జీతాల పెంపకై వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల నిరసన.

వనపర్తి
ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదాసీనత వైఖరి అనుసరిస్తూ కార్మికుల ఉసురు తీయొద్దని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్రాంచ్ అధ్యక్షులు గంధం శ్రీను,సీనియర్ నాయకులు నరసింహ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని, కాలం చెల్లిన ఏజెన్సీలను రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా వేతనాలు అందించాలని, జాతీయ పండగ ఆర్థిక 23 సెలవులు మంజూరు చేయాలని, బోనస్ చట్ట ప్రకారం ఒక నెల వేతనాన్ని కార్మికులకు బోనస్ గా అందించాలని, కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలని తదితర డిమాండ్ల సాధనకై నేటి నుండి మూడు రోజులపాటు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నిర్వహించ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త ఆసుపత్రి కార్మికుల పోరు బాటలు భాగంగా మంగళవారం వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదట కాంట్రాక్ట్ పారిశుద్ధ్య,సెక్యూరిటీ, పేషంట్ కేర్ ,సూపర్వైజర్ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.


ఈ సందర్భంగా గంధం శీను,నరసింహ మాట్లాడుతూ:- ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులు చాలీచాలని వేతనాలతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.రాష్ట్ర ప్రభుత్వం మానవత దృక్పథంతో ప్రభుత్వ ఆసుపత్రుల పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు పెంచి వారి సంక్షేమానికి దోహదపడాలని అన్నారు.ఇప్పటికే జీతాలు పెంచాలని అనేక పర్యాయాలు ఆందోళనలు నిరసనలు విజ్ఞాపన పత్రాలు అందజేసిన ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేని కారణంగానే నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే తొమ్మిదో తేదీన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలను దిబ్బంధం చేస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ నేతలు కార్మికులు శ్యాం,షాబాద్, టి.రవి, పవన్ కళ్యాణ్,ఖదీర్, మణికంఠ,శివ,ముజాయిత్, తిరుపతి రెడ్డి, వెంకటయ్య, రమేష్,కళావతి,సంతోషమ్మ,లక్ష్మి, గోవిందమ్మ, నవనీత, మహేశ్వరి, విజయలక్ష్మి,ప్రేమ కుమారి,తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top