నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కొరడా:ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు
గద్వాల టౌన్:-వాహనాలకు నెంబర్ ఫ్లేటు లేకుండా రోడ్లపై నడిపితే ఎవరిని ఉపేక్షించబోమని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు అన్నారు. సాయంత్రం సిఐ కార్యాలయ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించి, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ…వాహనాలకు నెంబర్ ప్లేట్లు, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో నెంబర్‌ప్లేట్లు లేని వాహనాలను గుర్తించి వారికి జరిమానా విధించారు.ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.
వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనక తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలన్నారు. నంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడపడం, స్టిక్కర్స్ వేయడం, వంచడం, ట్రిపుల్ రైడింగ్, సౌండ్ పొల్యూషన్ వంటివి చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వాహనాలను గుర్తించి సీజ్ చేయడం జరిగిందన్నారు. అట్టి వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుందని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే జరిమానాలు తప్పవన్నారు. గద్వాల టౌన్ పరిధిలో ప్రతినిత్యం వాహనాల తనిఖీతోపాటు బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంక్,డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ రమేష్,శివకుమార్,సుధాకర్,తిమ్మప్ప, విష్ణు పాల్గొన్నారు.