
ఓపెన్ నాలా డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 డివిజిన్ పరిధిలోని పరికి చెరువు నుండి ఆల్విన్ కాలనీ ఫేస్ 2 మీదుగా పైప్ లైన్ రోడ్డు వరకు విస్తరించి ఉన్న ఓపెన్ నాలా, వరద నీటి కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కూకట్పల్లి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) డి.గోవర్ధన్ గౌడ్ తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఓపెన్ నాలా పూడికతీత పనులను మాన్సూన్ కు ముందుగానే పూర్తిచేస్తామని అన్నారు. వేసవి కాలంలోనే పనులు పూర్తిచేస్తే వర్షాకాలంలో వచ్చే వరద నీరు అంతా సజావుగా దిగువకు వెళ్ళిపోతుంది కాబట్టి లోతట్టు ప్రాంతలవారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, షౌకత్ అలీ మున్నా, ఎఇ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
