TEJA NEWS

జాతిపిత విగ్రహానికి నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

అహింస అనే అయుధంతో సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భరతమాతకు దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 మరియు ఎల్లమ్మబండలో గల మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో మహాత్మాగాంధీజీ ఒకరు అని అన్నారు.

ఆయన మనకు అహింస, సత్యాగ్రహం అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసి, వాటిని వాడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు. మహాత్మాగాంధీ ఆశయాలు, జీవన విధానం ప్రతి వ్యక్తికి ఆదర్శం అవ్వాలని అన్నారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, షౌకత్ అలీ మున్నా, కొండారెడ్డి, నాగేష్ గౌడ్, మహేష్, ఇక్బాల్, నరసింహులు, రాజ్యలక్ష్మి, అరుణ, సౌందర్య, వల్లి రమణ, నీలా, పార్వతి, రాజేశ్వరి, UBD సూపర్వైజర్ నాగ రాణి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS