భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి సందర్శించారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు కాలనీ నీట మునగడం జరిగింది. భవిష్యత్ లో కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది జరుగకుండా కాలనీ ప్రహరీ నుండి నూతన కల్వర్టు ను కట్టుకునేల తన వంతు సహకారం అందిస్తానని తెలియజేసారు. దీని యొక్క ఏర్పాటు కోరకు గౌరవ MLC , MLA , మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల సహాయం తీసుకొని శాశ్వత పరిష్కారం చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంగం సభ్యులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.