TEJA NEWS

వామపక్షాలు బలపర్చిన కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ను గెలిపించాలని కోరుతూ నేడు సీపీఐ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్ నుండి జగతగిరిగుట్ట వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ ర్యాలీ కి ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ లు హాజరై మాట్లాడుతూ బీజేపీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్,డీజిల్ గ్యాస్ ధరలు పెరిగిపోయాయని,దళితులు, మహిళల పై అత్యాచారాలు , నిరుద్యోగం,విద్వేష పెరిగిపోయాయని వీటి గురించి మాట్లాడకుండా ప్రజలను మతం,దేవుడు పేరిట మభ్యపెట్టడానికి చూస్తున్నారని, కానీ ప్రజలు అన్ని తెలుస్కున్నారని కావున బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. మోడీ ఒడిపోతానని తెలిసి ఇష్టం వచ్చినట్లు ముస్లిం,పాకిస్తాన్ అంటూ 70 సంవత్సరాలలో ఏ ప్రధాని చెప్పని అబద్దాలు మోడీ చెప్పారని కావున ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులు ఈ సారి కాంగ్రెస్ కు మద్దతు తెలిపాయని కావున మేధావులు, కార్మికులు, రైతులు, ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు హరినాథ్, స్వామి,ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్,మునిసిపల్ అధ్యక్షుడు రాములు,సదానంద్ శాఖ కార్యదర్శులు వెంకటేష్, సాయిలు,సహాదేవరెడ్డి,శేఖర్ సుధాకర్,మహిళ సంఘం అధ్యక్షురాలు హైమవతి, ఇమామ్,నర్సింహ,రాజు,,చారి,చంద్రమ్మ,సుజాత,కలమ్మ,భాగ్యమ్మ,సుమారు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.


TEJA NEWS