TEJA NEWS

వ్యక్తి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పోరాడేది సిపిఐ.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

కుత్బుల్లాపూర్ మండలం జగత్గిరిగుట్ట శాఖ పార్టీ సభ్యత్వం పునరుద్దరణ సందర్భంగా నేడు శాఖ సభ్యులకు పార్టీ సభ్యత్వ కార్డులను ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి అధ్యక్షత వహించగా ఉమా మహేష్ ముఖ్యతితీగా విచ్చేసి సభ్యత్వాలు అందచేసి మాట్లాడటం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కొరకు ప్రాణ త్యాగాలకైనా సిద్దమని చెప్పి తెల్ల దొరలు పోయి నల్ల దొరలు కాదు సంపూర్ణ స్వాతంత్రం నినాదాన్ని ఇచ్చి అందరికి సమానమైన ఫలాలు అందించాలంటే సోషలిస్టు వ్యవస్థతోనే అది సాధ్యమని నాటి నుండి నేటి వరకు అనేక త్యాగాలను చేసిన చరిత్ర సిపిఐ కే ఉందని అన్నారు.
ఈ రోజు కేంద్రంలో,రాష్టంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేద ప్రజలకు కనీస అవసరాలైనా భూమి,విద్య,వైద్యం ను ప్రజలకు ఉచితంగా అందించకుండా మరిన్ని పన్నులు మోపి వాటికి దూరం అయ్యే విధానాలను అవలంభిస్తున్నాయని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలపైన పన్ను భారం వేసి పారిశ్రమికావేత్తలకు పన్ను రేట్లు తగ్గించి,రుణాలు ఇచ్చి వ్యాపారం చెయ్యడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప పేద ప్రజలకు మాత్రం సంపన్నులకు ఇచ్చిన రాయితీలను కూడా ఇవ్వట్లేదని అన్నారు.అన్ని బూర్జువా పార్టీలు వారి నాయకత్వం లేక పెట్టుబడిదారుల కోసం పని చేస్తాయని కానీ కమ్యూనిస్టులు మాత్రం పేద మధ్యతరగతి ప్రజల కోసం అనుక్షణం పోరాటం చేస్తారని అన్నారు. సిపిఐ సభ్యత్వం అందరికి ఇవ్వరని దాని సిద్ధాంతం కోసం ఎర్రజండా పట్టేవారికి మాత్రమే ఇస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జానకిరామ్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, సభ్యులు నగేష్ చారి,సోమయ్య,సామెల్,రవి,నర్సింహరెడ్డీ, భాస్కర్ లు పాల్గొన్నారు.


TEJA NEWS