TEJA NEWS

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. కృష్ణా టాకీస్ ఏరియాలోని సీతారామపురంలో నిర్వహించిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.1886 లో అమెరికాలోని చికాగో నగరంలో 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం కావాలని కార్మికులు సమ్మె చేస్తే యాజమాన్యం, పోలీసులు జరిపినదాడిలో తమ రక్తాన్ని చిందించిపోరాడి కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారనిఅన్నారు. అప్పటినుండి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులు మే ఒకటవ తేదీన మే డే ఉత్సవాలను జరుపుకుంటున్నారని అన్నారు.

దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక వర్గంపై అనేక భారాలు మోపుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందని అన్నారు. కార్మికులకు పని గంటలు పెంచి సంగం పెట్టుకునే హక్కును కాల రాస్తుందని అన్నారు. విపరీతంగా ధరలు పెంచి పేదలపై అనేక బారాలు మోపిందని విమర్శించారు. రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతుల మనుగడకి నష్టం కలిగించే చర్యలకు బిజెపి ప్రభుత్వం పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకపోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రోజురోజుకు బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కార్మిక,ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో లౌకిక,ప్రజాస్వామ్యక పార్టీలను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకిమద్దతు ఇస్తున్నామన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానంలో మాత్రంసిపిఎం పార్టీ స్నేహపూర్వక పోటీ చేస్తుందన్నారు .సిపిఎం పట్టణ కమిటీ సభ్యులుషేక్ సైదులు అధ్యక్షతన జరిగినఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, దండ వెంకట్ రెడ్డి, సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, పట్టణ కమిటీ సభ్యులుమామిడి పుల్లయ్య, అర్వపల్లి లింగయ్య, మామిడి సుందరయ్య, గండమల్ల భాగ్యమ్మ, పిట్టల రాణి, శశిరేఖతదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS