TEJA NEWS

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉదృత పోరాటాలు – సిపిఎం

ఉమ్మడి ఖమ్మం

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలని, అందుకు సిపిఎం కార్యకర్తలు తమ చివరి శ్వాస వరకు దోపిడీ పీడన నుంచి పీడిత ప్రజలను విముక్తి చేసేంత వరకు పోరాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ పిలుపు ఇచ్చారు. శనివారం నాడు జరిగిన సిపిఎం రఘునాథపాలెం మండల కమిటీ సమావేశం లో వారు పాల్గొని మాట్లాడారు కేంద్ర రాష్ట్ర పాలకులు ప్రజా సమస్యల పరిష్కరించకుండా ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని కులమత ప్రాంతాలతో సంబంధం లేకుండా అణగారిన వర్గాలను దోపిడీ పీడన నుంచి విముక్తి చేయడానికి ప్రతి సిపిఎం కార్యకర్త తన చివరి శ్వాస వరకు పోరాడాలని అన్నారు. పాలకులు ఎవరు అధికారంలోకి వచ్చిన తమ పెట్టుబడి దారి పంథాను మార్చుకోరని, వ్యవస్థలో అసమానతలు ఉండాలని కోరుకోవడం పెట్టుబడిదారీ విధానం సహజ లక్షణం అని, సిపిఎం కార్యకర్తలు మతోన్మాదాన్ని ఆర్థిక సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా రెండింటిని మేళవించి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రం, జిల్లా నాయకులు మనోహర్, మండల కార్యదర్శి ఎస్.నవీన్ రెడ్డి, నాయకులు చింతల రమేష్, రహీం ఖాన్, వల్లూరి శ్రీనివాస్, కుమార్, నరేష్, హరి, సక్కుబాయి, వంకాయలపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS