వేములవాడలో నెలకొన్న భక్తుల సందడి
రాజన్న జిల్లా జనవరి 19
వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి వారి ఆలయం లో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది.
అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో ఇతర మొక్కులు చెల్లించుకు న్నారు..