బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో ఉచిత సమ్మర్ క్యాంపులో బాగంగా నెల రోజుల పాటు వాలీబాల్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని టేకుమట్ల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దైద పాపయ్య అన్నారు తదనంతరం కొబ్బరికాయలు కొట్టి క్రీడలను ప్రారంభించి మాట్లాడారు.
బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ అధినేత షేక్ చాంద్ పాషా ఆర్థిక సహకారంతో, జిల్లా యువజన క్రీడల ప్రాధికార సంస్థ సౌజన్యంతో సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వాలీబాల్ శిక్షణ తరగతులు నెల రోజులు ఏర్పాటు చేయడం జరిగిందని క్రీడలు యువకులకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని క్రీడల్లో ప్రావీణ్యం పెంచుకొని క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ గడ్డం వెంకటేశ్వర్లు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్, గ్రామ యువకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.