పెడదారి పడుతున్న రాజకీయ పార్టీలు – దిగజారిపోతున్న నైతిక విలువలు.

TEJA NEWS

నేటి సమాజంలో రాజకీయాలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి నాటి ప్రభుత్వాలు నేటి ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్న అభివృద్ధి నినాదాలు వాస్తవాలకు అద్దం పడుతున్నాయా నిజంగానే అభివృద్ధి సాధించామా ప్రభుత్వ ఆదాయం , జిడిపి గణనీయంగా పెరిగినంత మాత్రాన అభివృద్ధి సాధించినట్లేనా ? నిజంగా దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రజలు అభివృద్ధి చెందింది ఎంత శాతం, తలసరి ఆదాయం పెరిగిన లెక్కలు చూసి అభివృద్ధి చెందామని మురిసుపోదామా చట్టం న్యాయం ధర్మం అందరికీ ఒకే విధంగా పాలకులు అందించగలుగుతున్నారా ? ఈ దేశంలో సామాన్యులు విద్యకు ఆరోగ్యానికి సరైన విధంగా ఖర్చు పెట్టే స్థితికి ఎదిగారా ప్రైవేట్ వారి స్థాయిలో సామాన్యులకు విద్య ఆరోగ్య సేవలు పాలకులు అందించగలుగుతున్నారా ? రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఆధారంగా సామాన్యులు చట్టసభలోకి వెళ్లగలుగుతున్నారా ? కనీసం స్థానిక సంస్థల్లో పోటీ చేసే పరిస్థితి నేడు సామాన్యులకు ఉందా డిగ్రీలు డబల్ పేజీలు చేసిన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అన్న నమ్మకం వారిలో ఉందా ? కులాల ఐక్యత మతసామరస్యానికి ఏ పాలకులు ఎంతవరకు ప్రయత్నం చేశారు. అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న పార్టీలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా రహదారులు కమ్యూనికేషన్, కరెంట్, జలవనరులు సాంకేతిక రంగాలు కొంతమేర అభివృద్ధి చేసినంత మాత్రాన అభివృద్ధి చేసింది కూడా వాస్తవమే అయినప్పటికీ రాజకీయాల్లో రోజురోజుకు దిగజారుతున్న విలువల ముందు వారు చేసిన అభివృద్ధి దిగదుడుపే అని చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని సేవా ప్రజాభివృద్ధి తమ లక్ష్యం అంటూ లక్ష్యం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి వెళ్లి తన విచిత్రాలు చేస్తూ వంగి వంగి దండాలు పెడుతుంటారు. ఎన్నికలు అయినాక ప్రజలకు నాయకుల దర్శనాలే ఉండవు ప్రజల సమస్యలు పట్టించుకోరు. అలాంటి నాయకులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పే పరిస్థితికి ఓటర్లు, యువత ఆలోచనలు ఎదిగాయా అవినీతి రాజకీయ నాయకులను ఎన్నికల్లో తిరస్కరించే స్థాయికి ఓటర్లు చైతన్యం అవడమే నిజమైన అభివృద్ధి నేటి పరిస్థితి చూస్తే చట్టసభల్లో 95 శాతం మంది నాయకులు అవినీతిపరులే సగం మందికి పైగా ఒక్కొక్కరు మీద పదులకంటే ఎక్కువ సంఖ్యల్లో అవినీతి నేరమైన కేసులు ఉన్నవారే ఉన్నారు. రాజకీయ నాయకులు ఉంటే ఆదర్శంగా ఉండాలి ప్రజల సమస్యలపై నిరంతరం శ్రమ పడేవాడై ఉండాలి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చట్టం రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాలి ఇప్పుడు చట్టాలను గౌరవించని వారు రాజ్యాంగాన్ని గౌరవించని వారు మన రాజకీయ నాయకులే కదా నైతిక విలువలు పాటిస్తూ సొంత సంపద అంటూ లేకుండా జీవితకాలం ప్రజల కోసమే పనిచేసిన నాయకులు ఆనాడు ఎందరో ఉన్నారు ఉదాహరణకి లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారాల నంద, పుచ్చలపల్లి సుదరయ్య, దామోదర సంజీవయ్య, ప్రకాశం పంతులు. అలాంటి నిస్వార్ధ నాయకులు ఈనాడు రాజకీయాల్లో కనిపిస్తున్నారా.?


లేదు 95 శాతం మంది నాయకులు అవినీతితో ఆస్తులు, అంతస్తులు పెంచుకుంటున్నవారే అలా ఆస్తులు సంపాదించి విచ్చలవిడిగా ఎన్నికల్లో ఖర్చుపెట్టి సామాన్యుడిని చట్టసభలోకి వెళ్లకుండా చేస్తున్నారు . అంతేకాకుండా సన్మార్గంలో నడిచే యువతను మత్తుల్లో ముంచుతున్నారు. రాజకీయ నాయకుల మూలంగా అధికారులు కూడా అవినీతి లంచగొండితనంలో కూరుకు పోతున్నారు. కొందరు అధికారులు రాజకీయాలకు తలకి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వారిని కూడా మనం చూస్తున్నాము రాజకీయ పార్టీలు అభివృద్ధి చేశాం చేస్తామని మాట్లాడుతున్నారు కానీ వారి అనైతిక విలువల వల్ల సమాజంలో జరుగుతున్న అవ లక్షణాలను రూపుమాపేస్తామని గాని మేము నైతిక విలువలకు కట్టుబడి నైతిక బాద్యతవహిస్తూ పరిపాలన అందిస్తామని గాని ఒక్క రాజకీయ పార్టీ కూడ ఒక్క నాయకుడు గాని చెప్పరు. ఎందుకంటే రాజకీయాలను పూర్తిగా అనైతికంగా మార్చివేశారు నిజమైన అభివృద్ధి జరగాలంటే ప్రజలు సమాజం ప్రశాంతంగా నేర రహితమైన సమాజం కావాలంటే ముందుగా రాజకీయ ప్రక్షాళన జరగాలి సరైన రాజకీయ ప్రక్షాళన జరగకుండా చేసే అభివృద్ధి అది మేడిపండు లాంటిదే అవుతుంది. నేటి సమాజంలో మనం రోజు చూస్తున్నాం, వింటున్నాం నడిబజారులు హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, భూఅక్రమనలు, అక్రమ బ్యాంకు దోపిడీలు, చిన్న చిన్న విషయాలకి హత్యలు మాదకద్రవ్యాల సరఫరా, పట్టపగలే చైన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు శిక్షలు వేసినా వీటిని ఆపగలుగుతున్నామా ? లేదు కదా !! రోజురోజుకు పెరుగుతునేన్నాయి వీటి నిర్మూలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా ? అనేది ఒక పెద్ద ప్రశ్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో నైతిక విలువలు పెంపొందిస్తూ జాతీయ భావాలు, దేశభక్తి గల యువతను తయారు చేయడం లో పాలకులు నడుం బిగించాలి ప్రతి ఒక్కరూ చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేలా ప్రజలను అలా తయారు చేయడమే నిజమైన అభివృద్ధి. అవన్నీ జరగాలంటే ముందుకు ముందుగా రాజకీయ ప్రక్షాళన ఎంతో అవసరం. రాజకీయ ప్రక్షాళనతోటే దేశాభివృద్ధి సమాజంలో నైతిక విలువలు విరాజిల్లుతాయి సమాజంలో విద్యార్థుల్లోనూ పౌరులను జాతీయ భావాలు దేశభక్తిని నైతిక విలువలు పెంపొందించగలిగినప్పుడే సమాజం ప్రశాంతంగా ఉండగలుగుతుంది. దేశం కూడా తప్పకుండా అభివృద్ధి చెందుతుంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page