TEJA NEWS

బాన్సువాడ

భారత దేశ మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతూ,బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో మరియు బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధి చౌక్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి డా. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ,బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి దుర్గం శ్యామల గారు, వర్ని మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా మరియు నియోజక వర్గ ప్రజాప్రతినిధులు,నాయకులు

ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోచారం మాట్లాడుతూ….

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, మితభాషి, మేధావి, అజాత శత్రువు…..

92ఏళ్ల మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో… డిల్లీ ఎయిమ్స్ లో కన్నుముశారు.

భారతదేశంలో అత్యంత గౌరవనీయులైన నేతల్లో ఒకరు.

మన్మోహన్ సింగ్ 1932, సెప్టెంబర్ 26న పంజాబ్‌ లో జన్మించారు

ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన, 1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యూహాన్ని మారుస్తూ, దేశాన్ని గ్లోబల్ మార్కెట్‌లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.

2004 నుంచి 2014 వరకూ, రెండు పదవీ కాలాల్లో భారత దేశ ప్రధానమంత్రిగా సేవలందించారు.

ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించిన అనంతరం, కేంద్ర ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రిగా పని చేశారు.

ప్రధానమంత్రిగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారు

భారతదేశ మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు


TEJA NEWS