Deputy Mayor visited Zilla Parishad High School, Nizampet
నిజాంపేట్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను సందర్శించిన డిప్యూటీ మేయర్
పాఠశాల పున ప్రారంభం సందర్భంగా నిజాంపేట్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు గురించి తెలియజేస్తూ తరగతి గదులు,గ్రౌండ్ బోర్, స్కూల్ బెంచ్ లు,సౌకర్యాలు కల్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కోరారు.డిప్యూటీ మేయర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం డిప్యూటీ మేయర్ పీఎం నిధులు ద్వారా మంజూరు అయినా సైన్స్ ల్యాబ్ పనులును సందర్శించి నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరాలని డిప్యూటీ మేయర్ ఆకాంక్షించారు.
ఈ యొక్క కార్యక్రమంలో కార్పొరేటర్ సుజాత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రఘునాథ్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.