TEJA NEWS

గోకుల్ ట్రస్ట్ ద్వారనే అభివృద్ధి సభ్యత్వ నమోదు

యాదవులకు బేడ్ పాలక్ బీమా అమలు చేయాలి

యాదవ మహా సభ జిల్లా అద్యక్షులు పలుమారు మల్లేష్ యాదవ్

ధర్మపురి
వెల్గటూర్ గోకుల్ ట్రస్ట్ ద్వారనే యాదవ సంఘం కమిటీలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేపడుతామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అద్యక్షులు పలుమారు మల్లేష్ యాదవ్ అన్నారు.అఖిల భారత యాదవ మహా సభ వెల్కటూర్ మండల అధ్యక్షులు మాచర్ల రాజేందర్ యాదవ్ అధ్యక్షతన కోటిలింగాల లో శుక్ర వారం ఏర్పాటు చేసిన సమావేశం లో మల్లేష్ యాదవ్ మాట్లాడారు. అఖిలభారత యాదవ మహాసభ గ్రామ శాఖ అధ్యక్షులు మండల శాఖ అధ్యక్షు ల ద్వారా ఇప్పటికే గోకుల్ ట్రస్ట్ ను రిజిస్ట్రేషన్ చేశామన్నారు .దీని ద్వారా గ్రామ యూనిట్ గా మెంబర్షిప్ అనేది గోకుల్ ట్రస్టు ద్వారానే జరుగుతుందని ఈ సందర్బంగా స్పష్టం చేశారు.యాదవ సంఘం పేరుతో ఇప్పటికే కొంత మంది ఊరూరుకు తిరుగుతూ మెంబర్షిప్ అని చెప్పి 200 వసూల్ చేస్తున్నారు. వారి చర్యలు యాదవ కులం ను విచ్ఛిన్నం చేసేలా ఉన్నా యని విమర్శించారు .

యాదవ సంఘం నాయకుల పేరుతో కొంత మంది కులవిచ్చిన్నం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు . యాదవ కులం మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేసే వారి చర్యలను అఖిల భారత యాదవ మహాసభ తరుపున ఖండిస్తున్నట్లు ప్రకటించారు.గతంలో యాదవులకు ప్రభుత్వం ద్వారా బేడ్ పాలక బీమా, గొర్రెలకు ఇన్సూరెన్స్ అమలవుతుండేదన్నారు. ఆ పథకమును బీ ఆర్ ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల ప్పట్టించుకోలేదని విమర్శించారు.ఈ ప్రభుత్వం బేడ్ పాలక బీమాను అమలు చేయాలని గొర్రెలకు ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నుంచి జగిత్యాల జిల్లాగా విభజన జరిగింది. జగిత్యాల లో గొర్రెల కాపరుల సహకార యూనియన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గొర్రెల మేకల మార్కెట్ యార్డులను ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్య క్రమంలో జిల్లా కార్య దర్శి ముక్కెర కుమార్ యాదవ్, సంఘ కుమార స్వామి మాచర్ల రాజేందర్, ఎలుక రాజు యాదవ్, నక్క లక్ష్మన్ యాదవ్, యాగండ్ల గంగన్న ,గోపు పోచయ్య, రాపాక మహేందర్ ఉన్నారు.

పోటో,మాట్లాడుతున్న అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు పలుమారు మల్లేష్ యాదవ్


TEJA NEWS