స్వీపర్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా, అధికారులకు వినతిపత్రం

స్వీపర్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా, అధికారులకు వినతిపత్రం

TEJA NEWS

Dharna in front of the Collectorate, petition to the authorities to solve the problems of the sweepers

[17:09, 14/06/2024] SAKSHITHA NEWS: స్వీపర్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా, అధికారులకు వినతిపత్రం అందజేత…… ఏఐటియుసి
ఉద్యోగ భద్రత కనీస వేతనం 26 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 15 లక్ష లు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్*
[17:09, 14/06/2024] SAKSHITHA NEWS: సాక్షిత వనపర్తి :

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న    స్వీపర్ల సమస్యలు  పరిష్కరించాలని ఏ ఐ టి యు సి  ఆధ్యర్యంలో   జిల్లా కలెక్టరేట్  ఎదుట ధర్నా. నిర్వహించారు  స్వీపర్లకు  . కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్

అమలకు నోచుకుని సుప్రీంకోర్టు తీర్పు..
ఒకే రకమైన పని చేస్తున్న స్వీపర్లకు రెండు రకాలుగా 5200/-.మరియు 1623/- జీతాలు ఇవ్వడం ఏమిటని
చాలి చాలని వేతనాలతో దుర్భర జీవితాలు అనుభవిస్తున్న స్వీపర్లు ను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా
వనపర్తి జిల్లా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష. జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకు అతి తక్కువ వేతనాలు అమలు చేస్తున్నారని 2016 అక్టోబర్ 17న తీసుకొచ్చిన జీవో నెంబర్ 180 ప్రకారం తేదీ 25 11 1993 నాటికి ముందు అనుమతి పత్రాలు ఉన్న స్వీపర్లకు నెలకు 5200 తర్వాత వారికి నెలకు 1623 గా విభజించి జీతాలు ఇస్తున్నారని ఇది సుప్రీంకోర్టు తీర్పుకు (సమాన పనికి సమాన వేతనం) చాలా విరుద్ధమని తెలిపారు . చాలీచాలని వేతనాలతో స్వీపర్లు అత్యంత దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వీపర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పార్ట్ టైం నిబంధనలో తొలగించి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్ని పాఠశాలల్లో స్వీపర్ల నియామకం చేపట్టాలని చనిపోయిన స్వీపర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని 60 సంవత్సరాలు నిండిన స్వీపర్లకు 15 లక్ష లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని. కార్మికులకు గుర్తింపు కార్డులు. పీఎఫ్. ఈఎస్ఐ. సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.. సమస్యలు పరిష్కారం చేయకపోతే పేపర్లతో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయం అధికారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘం తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు. ఖాజా పాషా. రషీద్. కోశాధికారి ఖయుమ్. నాయకులు గోపాల్ గౌడ్. వెంకటేష్. బాల పీరు. రామచంద్రయ్య. శోభారాణి.మన్నెమ్మ. కురుమన్న. తదితరులు పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS