TEJA NEWS

ప్రభుత్వ వ‌స‌తిగృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగాల సెక్రటరీలు.

దీపావ‌ళి కానుకగా రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌స‌తిగృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థ‌ల సొసైటీ (TREIS) ప‌రిధిలోని వ‌స‌తిగృహాల్లో డైట్ ఛార్జీలను పెంచిన ప్ర‌జా ప్ర‌భుత్వం.

డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన అధికారులు.

విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్ లో మార్పులు, చేర్పులు చేయాలని అధికారులకు సూచించిన సీఎం.

పది రోజుల్లో కొత్త డైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించిన సీఎం.

పెంచిన డైట్, కాస్మోటిక్ ఛార్జీలతో 7,65,705 మంది విద్యార్థుల‌కు చేకూరనున్న ప్ర‌యోజ‌నం.


TEJA NEWS