TEJA NEWS

ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు. 18 కోట్ల చెక్కుల పంపిణీ

ధర్మపురి
చెగ్యాం గ్రామంలో ముంపు బాధితులకు ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో వెల్గటూర్ మండలం చెగ్యం ముంపు బాధితులకు ప్రభుత్వం నుండి విడుదల చేసిన 126 ఇండ్లకు చెందిన 18 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కులను చెగ్యం గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో లబ్దిదారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మరియు అధికారులతో కలిసి పంపిణి చేశారు.*

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ..

ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 18 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క నాయకుడు ఇక్కడి బాధితుల గురించి పట్టించుకోలేదని,ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఎంతో మంది భూములు,ఇండ్లు కోల్పోవడం జరిగిందని,చాల సంవత్సరాలుగా ఇక్కడి ప్రాంత ప్రజలు పరిహారం కోసం ఎదురుచూడటం జరుగుతుందని,తను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇట్టి పరిహారం విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని,మంత్రి శ్రీధర్ బాబు ని కలిసి వారితో మాట్లాడి భూ నిర్వాసితులకు పరిహారాన్ని అందించడం జరుగుతుందని,దీనిపైన కూడా కొంత మంది ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం జరుగుతుందని,వారి హయంలో బాధితులకు పరిహారాన్ని అందిస్తాం అంటే మేము ఎక్కడ అడ్డుపడలేదని,ఒక ఎమ్మెల్యే గా,విప్ గా,మంత్రిగా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ ఎందుకు మరి పరిహారాన్ని అందించలేదో ప్రజలకు చెప్పాలని,ఇకనైనా ప్రతిపక్ష నాయకులు వారి వైఖరిని మార్చుకోవాలని,ఇంక పరిహారం రాని బాధితులు ఎవరైనా ఉన్న వారికి కూడా పరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS