
మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎంపికైన మహిళలకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబే దుల్లాలు కోత్వాల్ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు, ఈ సందర్భంగావారు మాట్లాడుతూ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 150 కుట్టుమిషన్లు వచ్చాయని తెలిపారు, అదేవిధంగా మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీఠం వేస్తుందని ఇంకా రానివారు అధర్యపడవద్దు విడతలవారీగా అందరికీ సమానత్వంగా ఇస్తాం అని ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ మెంబర్ ఠాగూర్ బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ విజయకుమార్ రెడ్డి, అధికారులు, స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
