TEJA NEWS

జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్
వనపర్తి :
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి బాధ్యతలను స్వీకరించారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఛాంబర్ లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి యాదయ్య సంతకాలు చేయించి బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో పరిచయం చేసుకొని సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
2023-24 బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు, మిగిలిన బడ్జెట్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
త్వరలో సమావేశం నిర్వహించి అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహిస్తానని తెలియజేశారు.
జడ్పి సి. ఈ. ఒ యాదయ్య, డిప్యూటీ సి. ఈ. ఓ రామ మహేశ్వర్ రెడ్డి, కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS