ఎన్ఎంసి టీఎస్ఎంసి దాడులపై జిల్లా మంత్రులు స్పందించాలి..

TEJA NEWS

ఆర్ఎంపి సంఘాల నాయకులు విజ్ఞప్తి..

మూడు సంఘాలతో జెఏసి ఏర్పాటు…

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

గత రెండు రోజులుగా ఖమ్మం పట్టణంలో ఆర్ఎంపిల ప్రథమ చికిత్స కేంద్రాలపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసి) , టిఎస్ఎంసీ లు సంయుక్తంగా చేస్తున్న దాడులపై జిల్లా మంత్రులు స్పందించాలని ఆర్ఎంపి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలో ఆర్ఎంపిడబ్యూఏ ,మైనార్టీ ,పట్టణ ఐక్యవేదిక సంఘాల నాయకులకు చెందిన ముఖ్యనాయకులతో పిల్లలమర్రి సుబ్బారావు అద్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా అద్యాక్షార్యదర్శులు బొమ్మినేని కొండలరావు బోయినపల్లి శ్రీనివాస్ రావు మైనారిటీ ఆర్ఎంపి ల వ్యవస్థపకుడు నజీర్ధున్ అద్యక్షుడు హసన్ పట్టణ ఐక్య వేదిక అద్యక్షుడు పిల్లలమర్రి సుబ్బారావు లు మాట్లాడుతూ తమ కుటుంబాలను పొట్టనింపుకునేందుకు కనీసం మౌళిక వసతులు లేని గ్రామాల్లో గత యాబై సంవత్సరాలుగా పేదప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్న తమపై దాడులు చేస్తూ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం సరియైందకాదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా యాబై వేలమంది ఆర్ఎంపి లు ఇదే వ్రుత్తి పై ఆధారపడి జీవిస్తున్నారని అటువంటి ఆర్ఎంపి ల వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తే జీవనోపాధి కోల్పోయి కుటుంబాలతో రోడ్డు న పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల మద్దతు తమకే ఉందని పేద ప్రజలనుంచి తమను ఎవరు దూరం చేయలేరన్నారు. ఆర్ఎంపి ల వ్యవస్థ కు నష్టంవాటిల్లే 428 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు.428 జీవో సవరణ చేసి వరకు దశల వారిగా పోరాటాలు చేస్తామని తెలిపారు. ఆర్ఎంపి ల సమస్యలు పరిష్కరం కోసం మూడు సంఘాలు తాత్కాలిక జెఏసి గా ఏర్పాటు చేశామని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు స్పందించి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.ఈకార్యక్రమంలో ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా గౌరవాధ్యక్షుడు ఆవుకు వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు నల్లమోతు కోటేశ్వరరావు మైనారిటీ నాయకులు ప్రధాన కార్యదర్శి జానీమీయా ఐక్యవేదిక నాయకులు రబ్బానీ మాధవరెడ్డి రహీం గోపాల్ నాగుల్ మీరా షంషుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Similar Posts