జూలై 20న భవన నిర్మాణ కార్మికుల జిల్లా కలెక్టరేట్ ముట్టడి ని.విజయవంతం చేయాలని …….. జిల్లా అధ్యక్షులు మదన్ పిలుపు

TEJA NEWS

జూలై 20న భవన నిర్మాణ కార్మికుల జిల్లా కలెక్టరేట్ ముట్టడి ని.విజయవంతం చేయాలని …….. జిల్లా అధ్యక్షులు మదన్ పిలుపు

జీవో నెంబర్ 12 ను రద్దు చేయాలని డిమాండ్
వనపర్తి
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వద్దు హెల్త్ టెస్టులను రద్దు చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జులై 20న చలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఉంటుందని బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గంధం మదన్ పిలుపునిచ్చారు గురువారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు జీవో నెంబర్ 12 ద్వారా అప్పగించిందని వెంటనే జీవనెంబర్ 12 నుండి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు

వెల్ఫేర్ బోర్డు స్కీములు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని బోర్డు నిధులు కార్మిక సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని పెన్షన్ పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇందిరమ్మ ఇండ్లు తదితరు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా ఉంటుందని ఆయన చెప్పారు వనపర్తి జిల్లాలోని అందరూ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి కురుమన్న జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ వనపర్తి టౌన్ కార్యదర్శి రాబర్ట్ అధ్యక్షులు బాలస్వామి నందిమల్ల రాములు బాల గౌడ్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top