తాటి చెట్లు ఎక్కే కార్మికులకు భద్రతే లక్ష్యం…

TEJA NEWS

తాటి చెట్లు ఎక్కే కార్మికులకు భద్రతే లక్ష్యం…

మల్కాపురం గౌడ సొసైటీలో సేఫ్టీ కిట్లపై అవగాహన….

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, తాటి చెట్లు ఎక్కే సమయంలో కల్లుగీత కార్మికులకు ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసే దిశగా మల్కాపురం గౌడ సొసైటీలో సేఫ్టీ కిట్ల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

గోదావరిఖని ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాటి చెట్లు ఎక్కే కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న భద్రతా ప్రమాణాలతో కూడిన సేఫ్టీ కిట్లను పరిచయం చేసి, వాటిని సక్రమంగా వినియోగించే విధానాన్ని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, తాటి చెట్లు ఎక్కే సమయంలో సేఫ్టీ కిట్లను తప్పనిసరిగా వినియోగించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. కార్మికులు తమ ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అందించిన భద్రతా పరికరాలను ప్రతిరోజూ వినియోగించాలని సూచించారు.

మల్కాపురం గౌడ సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ, కల్లుగీత కార్మికుల భద్రత కోసం చర్యలు చేపట్టిన ప్రభుత్వం, గోదావరిఖని ఎక్సైజ్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, కల్లుగీత కార్మికులు, ఎక్సైజ్ శాఖ అధికారులు మల్కాపురం సొసైటీ అధ్యక్షులు పొన్నం విజయ్ గౌడ్, మడ్డి రాంగోపాల్ గౌడు, రంగు దుర్గాప్రసాద్ గౌడ్, మడ్డి నవీన్ గౌడ్, వేముల చంద్ర గౌడ్, మడ్డీ నారా గౌడ్, సి హెచ్. అంజయ్య, బి సి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎం. శ్రీనివాస్, ఎక్ససిస్ ఎస్ ఐ రామగుండం ఎం బుచ్చయ్య గౌడ్ , ట్రైనర్ టి జీతేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top